బళ్లారి జిల్లా, హోస్పేట్.
*”గో ఆల్ అవుట్” అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పదమే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణానికి కారణం: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్*
*ఒక సీజన్ లో డ్యాం 33 గేట్లు తొలగించి, కొత్తవి నిర్మించడం దేశంలోనే ఓ రికార్డు..*
*ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, బోర్డు అధికారుల తో కలిసి డ్యాం గేట్ల నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి.*
*గడువు కంటే ముందే నిర్మాణ సంస్థ పనులు పూర్తి చేయనుంది.*
*వచ్చే సీజన్ కి డ్యాం 33 గేట్లు అమరిక పూర్తి అవుతుంది.*
*రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ప్రభుత్వం ఎంత వరకు అయినా వెళుతుంది అనడానికి ఇక్కడ జరుగుతున్న పనులు నిదర్శనం..*
*గత సీజన్ లో హంద్రీనీవా వెడల్పు పనులు పూర్తి చేసి చూపించాం.*
*మాటలతో కాదు చేతులతో పనులు చేసి చూపిస్తున్నాం..*
*గత ప్రభుత్వ హయాంలో గేట్లు, డ్యాంలు కొట్టుకుపోయినా స్పందించలేదు.*
*టీబీ డ్యాంలో ఒక్క గేటు కొట్టుకుపొతే పారుతున్న నీటికి అడ్డుకట్ట వేసి అప్పట్లో రైతుల ప్రయోజనాలు కాపాడగలిగాం..*
*రాయలసీమ రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది*
*: ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్*
