Latest Posts

అనంతపురంలో వెదురు సాగుపై అవగాహన: రైతులకు లాభదాయకమైన ‘పచ్చని బంగారం’!

అనంతపురం జిల్లా.

” వెదురు పెంపకం పై అవగాహన ”

స్థానిక అనంతపురం
టి టి డి సి నందు జిల్లా లోని ఏపి ఎం లకు, సి. సిలు, సెర్ప్ -వెలుగు మరియు ఇండస్ట్రీ ఫౌండేషన్ వారు సంయుక్త ఆధ్వర్యంలో “వెదురు సాగుపై” జిల్లా లోని 31 మండలాల సిబ్బంది కి ఒక రోజు శిక్షణ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్వయం సహాయక బృందాలు
మరియు రైతు సంఘల సభ్యులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా వెదురు సాగు ఒక మంచి అవకాశమని ఇండస్ట్రీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ప్రసంగి ఈ సందర్బంగా వివరించారు.
అనంతరం డిఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ మాట్లాడుతూప్రతి సంవత్సరం సకాలంలో వర్షాలు రాకపోవడం, పంటలు సరిగా పండకపోవడం, ఒకవేళ పంట పడిన గిట్టుబాటు ధర లేకపోవడం ముఖ్యంగా చిన్న సన్నగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి వెదురు సాగు మన జిల్లా రైతులకు ఒక ఒక వరంగా మారిపోతుందని తెలియజేశారు. ముఖ్యంగా గ్రామస్థాయిలోని రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని రైతులతో వెదురు సాగు ప్రాముఖ్యతను తెలియజేయాలని అలాగే నికర ఆదాయం వచ్చే జీవనోపాధిని కల్పించే విధంగా తోడ్పాటు అందించాలని డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ సిబ్బందికి సూచించారు.
ప్రతి రైతు తనకు ఉన్న పొలం కేవలం 37 సెంట్లు లో 60 మొక్కలు నాటి ఒక 3 సంవత్సరాలపాటు సాగు చేయగలిగితే 4 వ సంవత్సరంనుండి రూ.40 వేల నుండి రూ.50 వేల వరకు నికర ఆదాయం పొందవచ్చని డిపిఎం గంగాధర్ ఈ సందర్భంగా తెలిపారు.
వెదురు సాగు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న రైతులకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుందని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పెంచుకోవడం, మార్కెటింగ్ సమస్యలు లేని వెదురు సాగును రైతులు సాగు చేయడం లాభదాయకమని హార్టికల్చర్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలియజేశారు.
వెదురు సాగు చేసిన రైతులకు ఇండస్ట్రీ ఫౌండేషన్ వారు మార్కెటింగ్ వసతులు కల్పించడానికి రాష్ట్రస్థాయిలో సెర్ప్ తో ఒప్పందం చేసుకోవడం జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీడి రాధారాణి, డిపిఎం గంగాధర్ ఏపి ఎం నారాయణస్వామి, ఆర్టికల్చర్ ఆఫీసర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

Posted Under AP
Editor