స్వచ్ఛ్ ఆంధ్ర వాహనాలను ప్రారంభించిన ఎంపీడీవో దేశం గాని అంజినప్ప గారు
సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రమైన పాత పంచాయతీ కార్యాలయం ముందు స్వచ్ఛ్ ఆంధ్ర వాహనాలకు పూలమాలవేసి పూజలు నిర్వహించి నల్లమాడ వీధులలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సర్కిల్ మానవహారంగా ఏర్పడి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద .. ప్రతిజ్ఞ చేయించారు, అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎంపీడీవో అంజినప్ప గారు మాట్లాడుతూ ముందు చూపుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఎంతో ప్రముఖంగా స్వర్ణాంధ్ర …స్వచ్ఛ. ఆంధ్ర నిర్వహించారని ప్రజలందరూ నివాసాలను వీధులను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛంద కార్మికులు వస్తే తడిశెత్త పొడి చెత్త వేరుగా ఉంచి స్వచ్ఛందర కార్మికులకు సహకరించాలని వీధులు పరిశుభ్రంగా ఉంచుకొనుట వలన అంటువ్యాధులైన డయేరియా, మలేరియా, వంటి వ్యాధులు రావని, వాహనదారులు ఇబ్బందులు పడకుండా వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఇంటికి మొక్కలు నాటలని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత గురించి వివరించాలని, స్వచ్ఛ.. ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని వారు తెలిపారు,
ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో అంజనప్ప గారు, డిప్యూటీ ఎంపీడీవో అబ్దుల్, పంచాయతీ సెక్రెటరీ దాదాసాహెబ్, సచివాలయ సిబ్బంది దస్తగిరి, ఏ నరసింహులు,పంచాయతీ సిబ్బంది ,పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.
నల్లమాడలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’: స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎంపీడీవో అంజినప్ప
