అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం.
అనంతపురం, మార్చి 28 :
– *రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లి గ్రామంలో హాఫ్ మూన్ మోడల్ అమలును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భట్టువానిపల్లిలో అంజనేయులు బీడు పొలంలో హాఫ్ మూన్ మోడల్ అమలు చేయడం జరగగా, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రమీలమ్మ పొలంలో కూరగాయల మోడల్, వేరుశనగ మోడల్స్ లో ఫలితాలను పరిశీలించారు.*
– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని, ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకోవాలని సూచించారు. మహిళా సంఘాలు ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.*
– *హాఫ్ మూన్ మోడల్ వల్ల వర్షపు నీటిని నిల్వ చేయడం, నేల కోతను నివారించడం, నీరు నేలలోకి ఇంకేలా చేయడం, సుస్థిర వ్యవసాయానికి పునాది వేయడం, నేలను వివిధ పంటలతో కప్పి, పచ్చదనం కొనసాగించడం లాంటి ఉపయోగాలు ఉన్నాయి.*
– *గ్రామనికి చెందిన అంజనమ్మ పొలంలో కలెక్టర్ కి పిడిఎంఎస్ గురించి, విత్తన గుళికల తయారీ విధానాలు, ఉపయోగాలను CT & IO వివరించగా, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పిడిఎంఎస్ విత్తనాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో CT& IO, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, డిపిఓ నాగరాజు నాయుడు, వ్యవసాయ అధికారులు, గ్రామపెద్దలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.*
