Latest Posts

కలెక్టరేట్ లో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.

 

అనంతపురం, మార్చి 28 :

– *అనంతపురం కలెక్టరేట్ లో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రతి నెల నిర్వహించే “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా మార్చి నెల మూల విభజన & వ్యర్థరహిత జీవనశైలులు అనే థీమ్ తో కార్యక్రమం నిర్వహించగా, ఇందులో డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా టూరిజం అధికారి జయ కుమార్ బాబు, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, కలెక్టరేట్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం అవరణాన్ని శుభ్రం చేశారు. కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులందరిచేత “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ప్రతిజ్ఞను డిఆర్ఓ చేయించారు.*

– *ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ హోమ్ కంపోస్టింగ్ ను ప్రోత్సహించాలని, రోజా పారిశుధ్య సిబ్బందికి మీ ఇంటిలోని చెత్తను తడిచెత్త- పొడిచెత్తగా వేరుచేసి అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ని శుభ్రం చేస్తున్నామన్నారు. మన దేహాన్ని ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో అలాగే మీ కార్యాలయం ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ లలో, తదితర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, గతవారం పండుగ నేపథ్యంలో ఈనెల నాల్గవ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిజిఆర్ఎస్ డిటి జయశ్రీ, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.*

Posted Under AP
Editor