Latest Posts

రాయదుర్గంలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

*దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు
ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు

రాయదుర్గం పట్టణం కేంద్రంలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి, వారితో సహపంక్తి భోజనం చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో 50% రాయితీ మాత్రమే ఉండగా, ఇప్పుడు 21 వర్గాల దివ్యాంగులకు పల్లెవెలుగు నుండి ఎక్స్ప్రెస్ బస్సుల వరకు పూర్తి ఉచిత ప్రయాణం కల్పించడం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛనును రూ.6,000కు పెంచడంతో పాటు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించి కూటమి ప్రభుత్వం దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యవర్గ సభ్యురాలు జింక వసుంధర, జనసేన ఇంచార్జ్ మంజునాథ, ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్, టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Posted Under AP
Editor