Latest Posts

ఒకే రోజు రెండు హామీలు అమలు చేశాం -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు:

నారా చంద్రబాబునాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఒకేరోజు రెండు హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రంజాన్ కానుకగా ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతన నిధులు రూ.45 కోట్లు విడుదల చేసిందన్నారు. అమరావతిలో కొత్తగా హజ్ హౌస్ నిర్మాణం చేపట్టడానికి, కడపలో హజ్ హౌస్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 11 లక్షల మంది దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు

Posted Under AP
Editor