Latest Posts

అనంతపురంలో ‘శ్రీ పరాభవ’ నామ ఉగాది వేడుకలకు సర్వం సిద్ధం: అధికారులకు డీఆర్వో ఆదేశం

అనంతపురం జిల్లా

నూతన తెలుగు సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలి…

అనంతపురం, మార్చి 18: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఉగాది వేడుకలను నిర్వహించాలని ఆదేశించిందని, ఈ నేపథ్యంలో కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో రేపటి రోజున గురువారం ఉదయం 9:30 గంటల నుండి 11.00 గంటల వరకు కార్యక్రమాల ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మాలోల ఆదేశించారు.

బుధవారం ఉదయం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో వివిధ శాఖల అధికారులతో కార్యక్రమ నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ నూతన తెలుగు సంవత్సర ఉగాది
కార్యక్రమంలో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో తొలుత ప్రార్థన, అనంతరం కొంతసేపు భక్తి గీతాల గేయాలపన, అలాగే పంచాంగ శ్రవణం, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు జరుగుతాయన్నారు. “శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకలను” సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించడానికి సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా టూరిజం శాఖ అధికారి జయ కుమార్, దేవాదాయ శాఖ అధికారి మల్లికార్జున ప్రసాద్, ఉద్యాన శాఖ అధికారి పద్మలత,జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, విద్యాశాఖ ఏడి శ్రీనివాసులు, పురావస్తు శాఖ అధికారి స్వామి నాయక్, ఆన్ సెట్ మేనేజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor