Latest Posts

పేద విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ’ అమృత హస్తం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తో
సన్న బియ్యంతో నాణ్యమైన భోజనాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని పై తోట కాలనీలో భక్త కన్నప్ప ప్రైమరీ స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం గురించి విద్యార్థులతో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. భోజనo నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకోవడంతోపాటు ఆయన పరిశీలించారు . అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేసి వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ భోజనం నాణ్యత చాలా బాగుందని ముఖ్యంగా సన్నబియ్యంతో వండిన భోజనం ఎంతో రుచికరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కింద నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని పేద విద్యార్థులందరికీ నిత్యం అందుబాటులో తీసుకొచ్చి వారి కడుపులో నింపుతున్నారన్నారని కొనియాడారు.

 

Posted Under AP
Editor