Latest Posts

రైతు అరటి తోటపై దుండగుల దాడి: బాధితుడిని పరామర్శించిన హరీష్ బాబు

తాడిమర్రి(yes9tv)రైతు అరటి తోటకు నిప్పు – ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పరామర్శ
తాడిమర్రి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రైతు ఏటుకూరు నాయుడు అరటి తోటలో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి తీవ్ర నష్టం కలిగించారు. అదేవిధంగా నీటి పైపులైన్, గేట్లు ధ్వంసం చేయడంతో రైతుకు గణనీయమైన ఆస్తి నష్టం వాటిల్లింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి ఇన్‌చార్జ్ హరీష్ బాబు, తహసీల్దార్ భాస్కర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని తోటను పరిశీలించారు. బాధిత రైతు ఏటుకూరు నాయుడును పరామర్శించి, ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
అలాగే, పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన హరీష్ బాబు, నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ దేవర రాము, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంక నాగార్జున, సింగిల్ విండో డైరెక్టర్ అనుగుర్తి రమణ, ప్రధాన కార్యదర్శి ఆరవేటిఆనంద్, వీర రాఘవ, గంగరాజు జనసేన జిల్లా కార్యదర్శి దూది జయ రామాంజనేయులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Posted Under AP
Editor