Latest Posts

తాడిమర్రిలో వైఎస్ఆర్సిపి 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు

తాడిమర్రి( yes9tv)మండలంలో వైఎస్ఆర్సిపి 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గురువారం మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు తాడిమర్రి మండల కేంద్రంలో “హరితాంధ్రప్రదేశ్ సృష్టికర్త – పేద ప్రజల ఆశాజ్యోతి” అయిన దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించనున్నారు.
ఈ కార్యక్రమానికి తాడిమర్రి మండలం మరియు మండలంలోని గ్రామాల నుండి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు, మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకురాళ్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు పార్టీ శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి ధర్మవరం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కుంటాల పుల్లయ్య కోరారు.
అందరూ తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Posted Under AP
Editor