Latest Posts

“సేవ్ RDT – సేవ్ అనంత”: ఉరవకొండలో వై. విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా.. FCRA పునరుద్ధరణకు డిమాండ్!

RDT ని రక్షించుకుందాం – అనంత ను కాపాడుకుందాం
ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ధర్నా

. FCRA ను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరణ చేయాలి …

ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయా కర్త, వై విశ్వేశ్వర్ రెడ్డి గారు _ ,,,,

. *సేవ్ RDT సేవ్ అనంత
. _వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలు

. పేదల సేవే RDT లక్ష్యం బడుగు బలహీన వర్గాలు గిరిజనుల అభివృద్ధి కి తోర్పాటు వేల సంఖ్యలో ఉచిత ఇళ్లు, ఉన్నతమైన వైద్యం…

✍️ : మాటలు చెప్పే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పేదల సేవే పరమార్థంగా రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌డీటీ) పని చేస్తోంది. చిన్న పని చేసి పెద్ద గౌరవాలను కోరుకునే సంస్థలు, వ్యక్తులు కొందరు, ప్రభుత్వ నిధులను కాజేయడానికే ఏర్పడిన సంస్థలు మరి కొన్ని ఉన్నాయి. కానీ ఆర్‌డీటీ సంస్థ అందుకు భిన్నంగా పేదల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తోంది. ఇతో ధికంగా నిధులు వెచ్చిస్తూ వారి జీవనశైలిని మార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ప్రధానంగా ఆధునిక సమాజానికి దూరంగా ఆర్థి కంగా అత్యంత వెనుకబడిన అటవీ ప్రాంతం లో నివశించే ఆదివాసీలయిన చెంచు గిరిజనులకు అండదండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా వారి జీవనోపాధి పెంపొందించే మార్గాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహాలను ఎప్పటికప్పు డు తెలియజేస్తూ వారి లో చైతన్యం నింపుతు న్నారు. ప్రతి గ్రామంలో చెంచులకు అనాధిగా ఆనవాయితీగా వస్తున్న దురలవాట్లు సారా తాగడం, సెలిమలు, కాలువల్లో నీటిని తాగడం వంటి విషయాల్లో అవగాహన సదస్సుల ద్వారా చైతన్యవంతులను చే స్తున్నారు. వారు నివసించే స్థలాలకు రెవెన్యూ అధికారులతో నివేశన పట్టాలను మంజూరు చేయించి, పూర్తి ఖర్చులతో పక్కా గృహాలను నిర్మించి అప్పగిస్తున్నారు. గిరిజన మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి మేకలు, గొర్రెలు, పాడి గేదెలు, రాయితీపై రుణాలు అందజేసి జీవనోఫాదులు పెంపొదిస్తున్నారు. అంతేగాక విస్తరాకుల తయారీ, కుట్టు మిషన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఉచితంగా మిషన్లను అంద జేస్తున్నారు.మూలనిధులను అందజేస్తూ తో డ్పాటు నందిస్తున్నారు. వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు ఎద్దులు, విత్తనాలు, ఎరు వులు ఇస్తున్నారు. ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి గర్భిణులు, బాలింతలకు, క్షయ రోగులకు పౌష్గికాహారం అందజేస్తున్నారు. బాగా చదివే పేద విద్యార్ధులకు పూర్తిగా సొంత ఖర్చు తో ఉన్నత విద్యను అందిస్తున్నారు.

Posted Under AP
Editor