Latest Posts

గుత్తి కోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురము, మార్చి 09:

– *గుత్తి కోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గుత్తి ఫోర్ట్ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.*

– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14, 15వ తేదీలైన శనివారం, ఆదివారంలలో రెండు రోజుల పాటు గుత్తి కోట ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఆయా శాఖల అధికారులు సహకారం అందించాలని, ఆయా శాఖల పరిధిలో వివిధ యాక్టివిటీలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనేలా చూడాలని, ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.*

– *ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, ఎస్డీసిలు రామ్మోహన్, ఆనంద్, మల్లికార్జునుడు, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా టూరిజం అధికారి జయకుమార్ బాబు, ఆయా శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు.*

Posted Under AP
Editor