బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా బ్యాళ్ల పార్థసారధి నియామకం…

తాడిమర్రి yes9tvమండలంలోని పెద్దకోట్ల గ్రామానికి చెందిన బ్యాళ్ల పార్థసారధిని భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకాన్ని భారతీయజనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జిల్లా శేఖర్ స్వామి మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బిల్లు కుల్లాయప్పలు ప్రకటించారు. ఈ కార్యక్రమం తాడిమర్రి మండల కన్వీనర్ దేవరామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా బ్యాళ్ల పార్థసారధి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు జిల్లా శేఖర్ స్వామి గారికి, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సునీల్ రెడ్డి గారికి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బిల్లు కుల్లాయప్ప గారికి, మండల కన్వీనర్ దేవరామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే తన నియామకానికి సహకరించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ గారికి మరియు ఖగోళ హరీష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పార్థసారధి స్పష్టం చేశారు

Posted Under AP
Editor