Latest Posts

11,987 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ – జిల్లా కలెక్టర్ఎ.శ్యామ్ ప్రసాద్ ఐ.ఏ.ఎస్

శ్రీ సత్యసాయి జిల్లా జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం అమలుపై కలెక్టర్ గారు అధికారులతో జిల్లా స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 11,987 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 23.97 MWp సామర్థ్యంతో ఉచిత సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు మంజూరయ్యాయి. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం చేసే కుటుంబాలకు ఈ అవకాశం. హిందూపురం, కదిరి, పుట్టపర్తి డివిజన్లలో సర్వే పనులను వెంటనే పూర్తి చేయాలి. వెండర్లు మరియు APSPDCL అధికారులు సమన్వయంతో ఫీజిబిలిటీ క్లియరెన్స్, మీటర్ ఏర్పాటు మరియు సింక్రనైజేషన్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఫీల్డ్ స్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి, లక్ష్యాలను సమయానికి సాధించాలని పేర్కొన్నారు. సమన్వయంతో మీటర్ల ఏర్పాటు, సింక్రనైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అర్హులైన పేద కుటుంబాలకు విద్యుత్ ఖర్చులను తగ్గించి, ఉచిత సౌర విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.అర్హులైన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ సదుపాయం అందించి, వారి విద్యుత్ ఖర్చులను తగ్గించడం ఈ పథక ప్రధాన లక్ష్యమని కలెక్టర్ గారు తెలిపారు.

ఈ సమావేశంలో పథకానికి సంబంధించిన ఎంపానెల్డ్ వెండర్లు మరియు APSPDCL కు చెందిన సూపరింటెండింగ్ ఇంజినీర్ (SE), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (EE), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (DEE), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (AEE) పాల్గొన్నారు.

Posted Under AP
Editor