ఉగాది సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారి  అధ్యక్షతన విశ్వావసు నామ ఉగాది వేడుకలు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్ లో నిర్వహించారు..

పత్రికా ప్రకటన

విశ్వావసు నామ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి

అనంతపురం

 

ఈరోజు ఉగాది సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారి

అధ్యక్షతన విశ్వావసు నామ ఉగాది వేడుకలు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్ లో నిర్వహించారు

ఈ కార్యక్రమం లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భరతనాట్యం తిల్లానా

కూచిపూడి నాట్యం

తెలుగు పద కవిత పితామహుడు అన్నమయ్య గారి అదివో అల్లదివో శ్రీహరివాసము పాటలు పాడించారు.

అనంతరం అనంతపురం కవులు ఏలూరి యెంగన్న అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది .ఈ కవి సమ్మేళనంలో ఏలూరి యెంగన్న గారు తూముచెర్ల రాజారాం గారు చంద్రశేఖర శాస్త్రి గారు,

వెంకటేశ్వర ప్రసాద్ గారు, వన్నప్ప గారు పాల్గొని తమ కవితలను వినిపించారు.

అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఐదు మంది అర్చకులకు సన్మానం చేశారు. అంతేకాక కవి సమ్మేళనం లో పాల్గొన్న కవులను. సన్మానించారు.

అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శివనారాయణ శర్మ గారు జిల్లా రెవెన్యూ అధికారి మలోల గారు వచ్చిన వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

వచ్చిన వారందరికీ ఉగాది పచ్చడి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ చిరు తిండి ఏర్పాటు చేశారు.

వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాలోని ఉన్నతాధికారులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఇంటాక్ అనంతపురము జిల్లా చాప్టర్ సభ్యులు శేషగిరి నాయుడు సూర్యనారాయణ రెడ్డి రషీద్ శ్రీనివాస రెడ్డి సాధు శేఖర మధుర శ్రీ రియాజుద్దీన్ జూటూరు షరీఫ్ ఆకుల రఘురామయ్య

పాల్గొన్నారు రామ కుమార్ కన్వీనర్ ఇంటాక్ అనంతపురం జిల్లా చాప్టర్.

Editor