ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు జాతీయ ‘స్కోచ్ అవార్డు..

ప్రకాశం జిల్లా

 

బాల్య వివాహాలను నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి బంగారు భవిష్యత్తు ఉన్న బాల్యానికి బాటలు వేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియాకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది.

బాల్య వివాహాల నివారణకై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ *బంగారు బాల్యం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి విజయం సాధించారు.  త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ జాతీయ అవార్డును అందుకోనున్నారు.

కలెక్టర్ కృషి, చొరవను అభినందిస్తూ..ఆమెకు అవార్డు రావడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Posted Under AP
Editor