పేరు మోసిన దొంగ భీమినేని అమర్నాథ్ నాయుడుకు 3 ఏళ్ల జైలు శిక్ష..

శ్రీ సత్య సాయి జిల్లా..

  • 2021 లో అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన అప్పటి నల్లమడ సి.ఐ ఇస్మాయిల్
  • పేరు మోసిన దొంగ భీమినేని అమర్నాథ్ నాయుడుకు మూడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష ను విధిస్తూ పుట్టపర్తి జి ఎఫ్ సి ఎం కోర్టు తీర్పు …

 

వివరాలు…

పగటిపూట ఇళ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్న అంతర్ జిల్లా దొంగ భీమినేని అమర్నాథ్ నాయుడు ని 22.12.2021 తేదీన అప్పటి నల్లమడ సి.ఐ ఇస్మాయిల్ అరెస్టు చేసి అతని నుండి 650 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. రిమాండ్కు పంపారు.

* నల్లమడ పోలీస్ స్టేషన్ గ్రేవ్ కేసు నంబర్ 152/2021 లో దర్యాప్తు అధికారైన సిఐ ఇస్మాయిల్ జిల్లాలో నల్లమడ పోలీస్ స్టేషన్ కేసుతోపాటు 14 దొంగతనం కేసు లను చేదించి ముద్దాయి అమర్నాథ్ నాయుడు ను కోర్టులో హాజరు పరచడమైనది.

* ఈ క్రమంలో సీఐ ఇస్మాయిల్ గారు దర్యాప్తు చేసిన కేసులలో నల్లమడ పోలీస్ స్టేషన్ కేసు నంబరు 152/2021 మరియు 14/2020 లలో ముద్దాయికి ఒక్కో సంవత్సరం జైలు శిక్ష కదిరి కోర్టు వారు విధించి ఉన్నారు.

గత నవంబర్లో కొత్తచెరువు పోలీస్ స్టేషన్ దొంగతనం కేసు నందు 85/2019, సీఐ ఇస్మాయిల్ గారు సాక్షాధారాలు పుట్టపర్తి కోర్టు వారికి తన దర్యాప్తులో సేకరించిన ఆధారాలను సాక్షాలను కోర్టు వారికి సమర్పించినందున సదరు సాక్షాదారాలను పరిగణలో తీసుకొని ముద్దాయి అమర్నాథ్ నాయుడుకు మూడు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ముద్దాయిపై నేరం నిరూపణ అయ్యేవిధంగా పోలీస్ వారి తరఫున A P P లు నగేష్, బాబు రాజేంద్రప్రసాద్ ,

ముద్దాయికి జైలు శిక్ష విధించడంలో మరియు భాదితులకు న్యాయం జరిగే విధంగా దర్యాప్తు చేపట్టిన ఇస్మాయిల్ ఇన్స్పెక్టర్ గారిని, కోర్ట్ కానిస్టేబుల్ లు కృష్ణమాచారి, చంద్ర నాయక్ లను ఉన్నతాధికారులు ప్రశంసించారు.

 

పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం.

Posted Under AP
Editor