తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్, పరిణామాల తరువాత సినీ పరిశ్రమలో మార్పుల గురించి సూచనలు అందాయి. తెలంగాణ సీఎం రేవంత్ ఇక బెనిఫిట్ షో ..టికెట్ ధరల పెంపుకు నో చెప్పారు. దీంతో, ఇప్పుడు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు నిర్ణయం పై వేచి చూస్తున్నారు. కాగా, సీఎం చంద్రబాబు తెలుగు సినీ ఇండస్ట్రీ .. తాజా పరిణామాల పైన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
సినీ పరిశ్రమ పై
ముఖ్యమంత్రి చంద్రబాబు 2024 లో సాధించిన ఘనత .. 2025 లక్ష్యాల గురించి క్లారిటీ ఇచ్చా రు. 2024 తమకు చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న కసి తమకు భారీ మెజార్టీకి కారణమైందని చెప్పారు. వ్యవస్థలను విధ్వంసం చేసారని ఆరోపించారు.
జగన్ రాజధాని అమరావతికి చిక్కుముడులు వేసారని.. తాను తిరిగి ట్రాక్ లో పెడుతున్నానని చెప్పుకొచ్చారు. అమరావతికి నిధులు వచ్చాయని.. పోలవరం కూడా పూర్తి చేస్తామని చంద్రబాబు తన లక్ష్యాలను స్పష్టం చేసారు. ఏ రాష్ట్రంలో కూడా 6 నెలల్లో ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు రాలేదన్నారు. జగన్ సీపీఎస్ అమలు చేయలేదని, తనకు తెలియక హామీ ఇచ్చాను అని చెప్పారని విమర్శించారు.
చేరికల పైన స్పందన
సినీ పరిశ్రమకు సంబంధించి చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. సినిమాకు హైదరాబాద్ ఇప్పుడు హబ్‌గా మారిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ సినిమాకు బాగా పెరిగిందని వివరించారు. ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద చేయాలని.. మనకు ఇప్పుడు సినిమా గురించి అంత అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా తొలిసారి బీసీకి అవకాశం ఇచ్చామని చెప్పుకొచ్చారు. వైసీపీలో ఉన్నవారు షెల్టర్ తీసుకోవడానికి ఈ మూడు పార్టీల్లోకి వస్తున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు… దీనిపై మూడు పార్టీలలో చర్చ జరుగుతుందని… సంకీర్ణం ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయని పేర్కొన్నారు.
అన్నీ చూసుకుంటున్నాను
మూడు పార్టీలు కలిసి అన్ని విషయాలు మాట్లాడుకుంటామని వెల్లడించారు. తమ పార్టీ సభ్యత్వం 94 లక్షలకు చేరిందని.. టీడీపీ కేడర్‌లో హోప్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. పార్టీ కోసం త్యాగం చేసిన వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. అందరికీ పదవులు దక్కవ ని, అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసి పదవులు ఖరారు చేస్తున్నామని చెప్పారు. తనకు ఒక మెకానిజం ఉందని చెప్పారు. ప్రతీ విషయం క్రాస్ చెక్ చేసుకుంటున్నట్లు వివరించారు. గతంలో లాగా కాకుండా అన్ని విషయాలు తానే చూసుకుంటున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
