Latest Posts

టెన్త్‌ క్లాస్‌ పాసైతే చాలు.. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్‌న్యూస్‌. ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2021లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ సర్కిల్‌ కింద 1137 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు https://www.indiapost.gov.in/ అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తొలుత ప్రకటిచింన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్ 7 దరఖాస్తులకు చివరితేది. కానీ ఈ తేదీని పొడిగించారు. దీంతో ఏప్రిల్‌ 10 వరకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 1137

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన గణితం, స్థానిక భాష, మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో కూడిన 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు: 18-40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100/-

దరఖాస్తులు ప్రారంభం: మార్చి 8, 2021

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 10, 2021

వెబ్‌సైట్‌:https://www.indiapost.gov.in/

 

                                    ఇలా తినిపిస్తే మీ పిల్లలకు జీవితంలో షుగర్ రాదు

 

YES9 TV