లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత పాటు 18 మంది నక్సల్స్ మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో బీఎస్ఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో బీఎస్ఎఫ్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత శంకర్ రావుతోపాటు 18 మంది నక్సల్స్ మృతి చెందారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. నక్సల్స్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు చెప్పారు.
పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బందిని ఆస్పత్రులకు తరలించేందుకు అదనపు బలగాలను కల్పర్ అడవులకు పంపించామని తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్పీ కళ్యాణ్ ఎల్లిసెల వెల్లడించారు.
ప్రస్తుతం ఛోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోందని కాంకర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐకె ఎలెసెలా తెలిపారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత శంకర్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది
