ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నికల సమరానికి సిద్ధమైన ప్రధాన పార్టీల నాయకులు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక ఎన్నికల్లో మరో అంకానికి త్వరలో తెర లేవబోతుంది. నామినేషన్ల పర్వం ఎల్లుండి నుండి ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏప్రిల్ 18వ తేదీ నుండి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ మొత్తం ఏడు విడతల్లో జరగనున్న ఎన్నికలలో భాగంగా నాలుగవ దశలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న క్రమంలో ఏపీలో వాతావరణం మరింత వేడెక్కింది.
నామినేషన్ల ప్రక్రియకు రెడీ అవుతున్న రాజకీయ పార్టీలు మొత్తం ఏడు దశలలో ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 18న ప్రారంభమయ్యే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జూన్ 1వ తేదీతో ముగుస్తుంది.తొలివిడత ఎన్నికలలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రం నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. ఎల్లుండి నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేయడానికి మంచి ముహూర్తాలను చూసుకున్నారు.
ఏప్రిల్ 18న నోటిఫికేషన్, మే 13న పోలింగ్ అయితే చాలామంది అభ్యర్థులలో బీఫామ్ చేతికి వచ్చేవరకు టిక్కెట్ తమదా కాదా అన్న ఆందోళన వ్యక్తమౌతుంది. ఇక ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ చూస్తే ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రానుండడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 26 నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఆపై మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.
దేశవ్యాప్తంగా ఒకేసారి కౌంటింగ్.. జూన్ 4న ఫలితాలు ఇక దేశ వ్యాప్తంగా జూన్ 1 వరకు చివరి విడత ఎన్నికల పోలింగ్ తో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఏపీ, తెలంగాణా తో పాటు అన్ని చోట్లా కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. దీంతో సార్వత్రిక ఎన్నికల అంకం ముగుస్తుంది.
