ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయ్యి మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది.
చంద్రబాబుకు సుప్రీం ఆదేశం ఇక ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలక ఆదేశాలను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తి అయ్యేవరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని ఆదేశాలు జారీ చేస్తూ విచారణను మే ఏడవ తేదీకి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.
మధ్యంతర బెయిల్ ఇచ్చిన సమయంలో కోర్టు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సిఐడి అధికారులు 2023 ఆగస్టులో చంద్రబాబు ని అరెస్ట్ చేసి 52 రోజులు పాటు జైల్లో ఉంచారు. అయితే చంద్రబాబు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను జారీ చేసిన ఏపీ హైకోర్టు ఎటువంటి ఆరోపణలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ రద్దు పిటీషన్ పై వాదనలు అయితే సిఐడి వాదనలను ఏపీ హైకోర్టు పట్టించుకోలేదని ఆరోపిస్తూ, సుప్రీంకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం,ఏపీ సిఐడీ పిటిషన్ దాఖలు చేయడంతో నేడు కోర్టులో ఆసక్తికర వాదన జరిగింది. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఉందని చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ సిఐడి అధికారుల పేర్లను రెడ్ డైరీలో నోట్ చేసుకుంటున్నానని చెబుతున్నారన్నారు.
విచారణ మళ్ళీ అప్పుడే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు అధికారుల పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని, దీనివల్ల అధికారుల పైన తీవ్రమైన ప్రభావం పడుతుందని ఏపీ సిఐడి కోర్టులో వాదించింది. ఇది కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందని, ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోర్టులో వాదించింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని చంద్రబాబుకు సూచనలు చేస్తూ ఈ కేసు విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.
