ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. సిబిఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బిగుస్తున్న ఉచ్చు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత బయటకు రాకుండా ఎక్కడికక్కడ ఉచ్చు బిగుసుకుంటోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడి అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించిన కవితను, ఊహించని విధంగా ఈ కేసులో విచారణ నిమిత్తం సిబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈడి అధికారులు అరెస్టు చేసి, కవితను విచారించి జైలుకు పంపగా, ఇప్పుడు సిబీఐ కూడా ఆమెను అరెస్టు చేసి విచారించడానికి కోర్టు అనుమతి కోరింది.
కోర్టులో కవితకు చుక్కెదురు సిబిఐ తనను ప్రశ్నించడాన్ని, అలాగే తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కవితకు కోర్టులో చుక్కెదురైంది. సిబిఐ తనను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ తో పాటు, ఆమె అరెస్ట్ ను సవాల్ చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.
కవిత వాదన విన్నా కూడా కోర్టు తీర్పు ఇలా మరోవైపు కవిత కస్టడీని కోరుతూ సిబిఐ వేసిన పిటిషన్ పైన సంచలన తీర్పునిచ్చిన కోర్టు కవితను మూడు రోజుల సిబిఐ కస్టడీకి అనుమతించింది.తనను సిబీఐ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటికే సిబిఐ అధికారులు తనను ప్రశ్నించారని, అడిగిన ప్రశ్నలను మళ్లీమళ్లీ అడుగుతున్నారని కవిత కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
కవితను కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ అయితే కవితను విచారించి మరిన్ని వివరాలను తెలుసుకోవలసిన అవసరం ఉందని, ఆమె విచారణకు సహకరించడం లేదని, సిబిఐ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సిబీఐ వాదనతో ఏకీభవించి కవితను మూడు రోజుల సిబిఐ కస్టడీకి అనుమతించింది. దీంతో తీహార్ జైల్లో ఉన్న కవితను సిపిఐ తమకు స్టడీ లోకి తీసుకొని ఢిల్లీ దగ్గర కుంభకోణంలో అవినీతి ఆరోపణల పైన, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎవరి పాత్ర ఏమిటి అన్న దానిపైన లోతుగా దర్యాప్తు చేయనుంది.
