పినపాక # మణుగూరు
తేదీ :18-02-2024
—————————————–
ఈరోజు అనగా ఆదివారం మణుగూరు సురక్ష బస్టాండ్ నందు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదగా మేడారం స్పెషల్ బస్ ను రిబ్బన్ కట్ చేసి,జెండా ఊపి ప్రారంభించారు
*పాయం గారు మాట్లాడుతూ* భారతదేశంలోనే అతి పెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన, మేడారం సమ్మక్క సారక్క,జాతర,ఈనెల *21, 22, 23, వ* తేదీన జరిగే జాతరకు,భక్తుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు సౌకర్యార్థం ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,మేడారం జాతరకు, ప్రజలకు,అనుకూలంగా , మణుగూరు మండలం నుండి,30,ఆర్టీసీ బస్సు సర్వీస్ ను అందుబాటులో ఉండే విధంగా,ప్రణాళిక చేపట్టిందని, ప్రజలు ఈ అవకాశాన్ని,వినియోగించుకోవాలని మరియు, మహిళలు ఉచిత బస్సు,సర్వీసును వినియోగించుకోవాలని తెలియచేశారు తదుపరి బస్ డ్రైవర్స్ కి స్నాక్స్ అందజేశారు, మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ బస్ డ్రైవర్లకు లైన్స్ క్లబ్ వారు మూడు రోజులు ఉచిత భోజనం అందజేయుచున్న లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు,ఈ యొక్క కార్యక్రమానికి, ఆర్టీసీ జిఎం గారు, ఆర్టీసీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,మహిళ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు
