బీఆర్ఎస్ పార్టీకి భూ కేటాయింపుపై హైకోర్టులో పిటిషన్…

అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కు షాక్‍ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి 11 కేటాయింపు పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేట్ గ్రామంలోని నం. 239, 240 భారత రాష్ట్ర సమితికి 11 ఎకరాల భూమి కేటాయించారు.

 

ఈ ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్ధత లేదని లాయర్ వెంకటరామి రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ప్రామాణిక టెండర్ ప్రక్రియను అనుసరించకుండా, భూకేటాయింపుకు సంబంధించిన ప్రక్రియలను బహిరంగంగా వెల్లడించకుండా కేటాయింపులు జరిగాయని పిటిషన్ లో పేర్కొన్నారు. అక్కడ భూమి ధర ఎకరాకు రూ.50 కోట్లకు పైగా ఉందన్నారు. కానీ రూ.3 కోట్ల 41 లక్షల 25 వేలకు మాత్రమే బీఆర్ఎస్ కు భూమి కేటాయించారని చెప్పారు.

 

ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా హైకోర్టులో ఇదే విధమైన పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసు తీర్పు పెండింగ్‌లో ఉంది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ ఆఫీస్ లో వాణిజ్య కార్యకలాపాలు చేస్తున్నారని.. వెంటనే వాటి నిలిపివేయాలని కోరింది. బీఆర్ఎస్ ఆఫీస్ లో ఓ న్యూస్ ఛానెల్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

 

మరోవైపు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా విచారణ జరపాలని డిమాండ్ ఉంది. అలాగే పలువు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ పార్టీకి అధికారం కోల్పోయిన తర్వాత ఇబ్బందికర పరిస్థితలు ఏర్పడ్డాయి.

Editor