Latest Posts

కీర్తి సురేష్‌పై తాగుబోతు దాడి..

అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా ‘మహనటి’ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.

 

ఆ తరువాత ఈ అమ్మడు పలు చిత్రాల్లో గ్లామర్‌గా కనిపించి మెప్పించింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి. వచ్చే ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తాను చదువుకున్న రోజుల్లో ఎదురైనా లైంగిక వేధింపుల గురించి చెప్పడం జరిగింది.

 

నేను, నా స్నేహితురాలు నడుచుకుంటూ కాలేజీకి వెళ్తున్న సమయంలో ఓ తాగుబోతు వచ్చి నాపై చేయి వేశాడు. వెంటనే నేను ఆ తాగుబోతు చెంప చెళ్లుమనిపించానని కీర్తి సురేష్ తెలిపింది. నేను చేసిన పనికి అక్కడున్న వారంతా మెచ్చుకున్నారని.. ఈ ఘటన తనని ధర్యవంతురాలుగా చేసిందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు.

Editor