Latest Posts

రామ్ చరణ్ కూతురుకు జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో దీపావళికి సంబంధించిన పార్టీ ఘనంగా జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు మొత్తం మెగా ఫ్యామిలీ తో సహా రామ్ చరణ్ ఇంటికి వచ్చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున అందరూ రామ్ చరణ్-ఉపాసన కుమార్తె క్లింకారకు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి ఆశీర్వదించారు.

Advertisement

అందరిలోకి ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ చాలా హైలెట్ గా నిలిచింది. తారక్ విభిన్నంగా ఆలోచించి ఆ పాపకు ఉపయోగపడే వస్తువును బహుమతిగా ఇచ్చాడు. విదేశాల్లో చాలా ఖరీదైన బొమ్మగా ఉండే ప్లేసెట్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఐదు సంవత్సరాల వయసు వచ్చేవరకు క్లింకారకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే దీన్ని కొనుగోలు చేశాడంట. అంతేకాదు.. ఉపాసనకు వాడి పడేసే బొమ్మలంటే ఇష్టం ఉండదు. దీంతో ఉపాసన టేస్ట్ కు తగినట్లుగా, క్లింకారకు ఉపయోగపడే విధంగా తారక్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 చేస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రాబోతోందని దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ఆచార్య సినిమా ఫ్లాపవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను విజయం సాధించాలనే కసితో కొరటాల ఈ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. జాన్వీకపూర్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ను నిర్మాణ సంస్థలు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాయి. వచ్చే ఏడాది దేవర విడుదల కాబోతోంది.
Editor