వంగవీటి రాధా పెళ్లి ముహూర్తం, వేదిక ఖరారు – శుభలేఖ ఇలా..!!

వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహ పనులు ముమ్మరం అయ్యాయి. ఈ నెల 22న వంగవీటి రాధా వివాహం జరగనుంది. నర్సాపురం కు చెందిన పుష్పవల్లితో రాధా వివాహం ఖరారైంది.

నర్సాపురంలో ఈ మధ్యనే నిశ్చితార్ధం జరిగింది. రాధా వివాహానికి రాజకీయాలకు అతీతంగా ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో, కల్యాణ వేదిక ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాధా వెడ్డిండ్ కార్డు వైరల్ అవుతోంది.

ముహూర్తం ఫిక్స్: వంగవీటి రాధాకృష్ణ వివాహ ముహూర్తం ఫిక్స్ అయింది. మరో 14 రోజుల్లో అంటే అక్టోబర్ 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నం నందు నవ వధువరులు రాధ, పుష్పవల్లిలు ఒక్కటైయ్యేందుకు ఇరుపక్షాల పెద్దలు శుభ ముహూర్తాన్ని ఖరారు చేశారు.

రాజకీయ ప్రముఖులతో పాటుగా అభిమాన గణం పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో కళ్యాణ వేదికను అందుకు అనుగుణంగా ఖరారు చేసారు. విజయవాడ – నిడమానూరు పోరంకి రోడ్డు లోని మురళి రిసార్ట్స్‌లో జరుగనుంది. ఈ మేరకు ఆహుతులకు శుభలేఖలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఇరువైపులా బంధువులకు శుభపత్రికలు అందిస్తున్నారు.

అతిధులకు ఆహ్వానం: వంగవీటి రాధా నర్సాపురం అల్లుడు కాబోతున్నారు. నరసాపురం పట్టణానికి చెందిన జక్కం బాబ్జి అమ్మాని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. జక్కం అమ్మాని 1987-92 వరకు టీడీపీ నుంచి నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అమ్మాని బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లి. స్కూల్, కాలేజ్ విద్యాభ్యాసం అంతా నరసపురంలోనే జరిగింది.

అనంతరం హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. కొంతకాలం హైదరాబాద్‌లో యోగా టీచర్‌గా పనిచేసిన పుష్పవల్లి ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టారు. పుష్పవల్లి తండ్రి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే కొన్ని కారణాలవల్ల కొంతకాలం హైదరాబాదులో నివాసం ఉన్నారు.

వెడ్డింగ్ కార్డు వైరల్: ఇటీవల మళ్ళీ నరసాపురంలో నూతన గృహ నిర్మాణం పూర్తిచేసుకుని ఇక్కడే నివాసముంటున్నారు. ఇటీవల ఈయన జనసేన పార్టీలో జాయిన్ అయి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురం విచ్చేసినప్పుడు వీరి ఇంట్లోనే బస చేశారు.

ఇటీవల వంగవీటి రంగ జయంతి సందర్భంగా.. వంగవీటి రాధా వీరి నివాసానికి విచ్చేసి రంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగానే వివాహ సంబంధం గురించి ఇరువర్గల వారు మాట్లాడుకున్నారు. ఇక విజయవాడలో రాధా వివాహ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అటు ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు రాధా సిద్దం అవుతన్నారని చెబుతున్నారు.

Posted Under AP
YES9 TV