ఏఐసీసీ ఆఫీసు ముందే మిస్ బికిని ఇండియాపై దాడి, తండ్రితో ?, వీడియో వైరల్ !

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని హస్తినాపూర్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి గతేడాది కాంగ్రెస్‌ (congress) టికెట్‌ పొందిన ‘మిస్‌ బికినీ ఇండియా’ అర్చనా (Archana) గౌతమ్‌, ఆమె తండ్రిపై ఢిల్లీలోని అదే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది.

అర్చనా ప్రముఖ మోడల్‌గా (miss bikini india) కూడా పని చేస్తోంది. బిగ్ బాస్ 16 కంటెస్టెంట్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అర్చనా గౌతమ్ నిత్యం వార్తల్లో ఉంటోంది. ఇప్పుడు ఢిల్లీలోని కాంగ్రెస్ (congress)పార్టీ కార్యాలయం ఎదుటే అర్చనా గౌతమ్ ను కొట్టడం తీవ్ర కలకలం రేపింది.

బికినీ ధరించి వార్తల్లోకెక్కిన అర్చనా (Archana)గౌతమ్ కు గతంలో కాంగ్రెస్ (congress)పార్టీ టిక్కెట్లు ఇవ్వడంపై ఆ పార్టీ నాయకుల మీద గతంలోనే బీజేపీ విరుచుకుపడింది. కాంగ్రెస్ టికెట్ ప్రకటించిన వెంటనే అర్చనా (Archana)బికినీలో దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకడం లేదు. అందుకే చీప్ జిమ్మిక్కు చేస్తోంది. సంస్కృతికి గౌరవం ఉన్న హస్తినాపురం లాంటి నియోజకవర్గాల్లో కేవలం ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో బికిని బామ అర్చనాకు టిక్కెట్ ఇచ్చారని, ఆమెకు రాజకీయాల గురించి ఏమాత్రం తెలీదని అప్పట్లో బీజేపీ (BJP)నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు.

కాబోయే భర్తతో వెళ్లిన యువతి, గస్తీ పోలీసులు ఏం చేశారంటే ?, కొన్ని గంటలు !

ఇప్పుడు అదే అర్చనా గౌతమ్ మీద ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయం ఎదుటే దాడి జరగడం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అర్చనా (Archana) గౌతమ్ ఆమె తండ్రితో కలిసి కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని (priyanka gandhi) అభినందించేందుకు అర్చనా గౌతమ్ ఆమె తండ్రితో కలిసి కాంగ్రెస్ (congress) పార్టీ కార్యాలయం దగ్గరకు వెళ్లిన సమయంలోనే ఆమె మీద దాడి జరిగింది.

 

YES9 TV