తెహ్జూన్ కార్మాలవాలాది పుణె. బిజినెస్ మ్యాన్. దేశ, విదేశాలు పర్యటించడం ఆయన హ్యాబీ. 2021 అక్టోబర్ లో ఒక కొత్త పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘దేఖో అప్నా దేశ్ ‘ కార్యక్రమం స్ఫూర్తిగా సంపూర్ణ భారతదేశాన్ని సందర్శించాలని ప్రయాణం ప్రారంభించారు.
63 వేల కిలోమీటర్లు..
2021 అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా సుమారు 63 వేల కిలోమీటర్లు ఆయన ప్రయాణించారు. తన సొంత ఎస్ యూ వీలో ఒంటరిగానే ఈ ప్రయాణం చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక పర్యాటక కేంద్రాలు, మారుమూల ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి అందాలు, లోయలు, పర్వతాలు, ఎడారులు, ప్రమాదకర ప్రాంతాలు.. ఇలా అన్నింటినీ ఆయన దర్శించారు.
ఈ ప్రయాణంలో..
ఈ ప్రయాణంలో 104 నేషనల్ పార్క్ లను, 54 టైగర్ రిజర్వ్ లను, 32 ఎలిఫెంట్ రిజర్వ్ లను, 40 కి పైగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ను ఆయన సందర్శించారు. రాజస్తాన్ ఎడారి అందాల నుంచి ఈశాన్య రాష్ట్రాల భిన్నత్వాలను, హిమాలయాల సొగసును దర్శించడమే కాకుండా, వాటిని తన కెమెరాలో బంధించారు. భారత దేశ ప్రాకృతిక అందాలను, సాంస్కృతిక వైభవాన్ని, చారిత్రక ఘనతను డాక్యుమెంట్ చేయాలన్న లక్ష్యంతో ఆయన ఈ పర్యటన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక భిన్నత్వాన్ని కూడా ఆయన క్యాప్చర్ చేశారు.
రికార్డు పుస్తకాల్లోకి..
తెహ్జూన్ కార్మాలవాలా చేపట్టిన ఈ యాత్ర రికార్డు పుస్తకాల్లోకి కూడా చేరింది. లాంగెస్ట్ కంటిన్యుయస్ ఎక్స్ ప్లొరేటరీ ఎక్స్ పెడిషన్ (Longest Continuous Exploratory Expedition) ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.
