Latest Posts

ప్రభుత్వ రంగ సంస్థ ‘రైట్స్’ లో ఇంజనీర్ పోస్ట్ ల భర్తీ

ప్రభుత్వ రంగ సంస్థ ‘రైట్స్ (RITES)’ లో ఇంజనీర్, పలు ఇతర పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇది లిమిటెడ్ రిక్రూట్ మెంట్. రైట్స్ లిమిటెడ్ మినిరత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.

దీన్ని గతంలో ‘రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీసెస్ లిమిటెడ్’ గా వ్యవహరించేవారు.

ఆన్ లైన్ అప్లికేషన్

తాజాగా, రైట్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మొత్తం 129 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్ లకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు రైట్స్ అధికారిక వెబ్ సైట్ rites.com ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జులై 4. ముందుగా వచ్చిన వారికి ముందుగా అవకాశం ఇచ్చే (first come first serve) పద్దతిలో జూన్ 30 వ తేదీ నుంచే ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. ఇంటర్వ్యూ షెడ్యూల్ ను రైట్స్ వెబ్ సైట్ rites.com లో అప్ లోడ్ చేస్తారు. అర్హత, ఎంపిక ప్రక్రియ, వయో పరిమితి తదితర వివరాల కోసం నోటిఫికేషన్ ను పరిశీలించండి.

Vacancy Details: వేకెన్సీ వివరాలు

సూపర్ వైజర్ కమ్ కన్ట్రక్షన్ మేనేజర్ – 9 పోస్ట్ లు
డ్రాఫ్ట్స్ మ్యాన్ – 20 పోస్ట్ లు
క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ కంట్రోల్ ఇంజనీర్ – 20 పోస్ట్ లు
ఫీల్డ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ – 80 పోస్ట్ లు
Selection Process: ఎంపిక ప్రక్రియ

ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ప్రాతిపదికన ఎంపిక ఉంటుంది. ఇందులో అనుభవానికి 10%, ఇంటర్వ్యూకి 90% వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూలో జనరల్ కేటగిరీ వారు 60% మార్కులు, ఇతరులు 50% మార్కులు కచ్చితంగా సాధించాలి. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

YES9 TV