Latest Posts

55గ్రాముల పాప్​కార్న్​ ధర రూ. 460- ‘అందుకే ఎవరు థియేటర్లకు వెళ్లట్లేదు!’

ఇండియాలో సినిమా ప్రియులు చాలా మందే ఉంటారు. ఇక తమకిష్టమైన హీరో, హీరోయిన్​ సినిమా విడుదలైందంటే ఫస్ట్​ డే ఫస్ట్​ షో చూడాలని తహతహలాడుతారు.

టికెట్​ రేట్లు ఒక ఎత్తు అయితే, అక్కడ ఫుడ్​ రేట్లు మరో ఎత్తు! కొన్ని సందర్భాల్లో టికెట్​ రేట్లు తక్కువే ఉన్నా, పాప్​కార్న్​ రేట్లు చూసి షాక్​ అవ్వాల్సిందే. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 55 గ్రాముల చిన్న పాప్​కర్న్​ బకెట్​ ధర రూ. 460కి కొన్న బిల్​ను ఓ వ్యక్తి ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. ఈ ట్వీట్​ ఇప్పుడు వైరల్​గా మారింది.

వామ్మో.. ఇంత ధరా..?

త్రిదిప్​ కే మండల్​ అనే వ్యక్తి ఈ ట్వీట్​ చేశాడు. నోయిడా పీవీఆర్​ సినిమాస్​కు వెళ్లిన అతను పాప్​కార్న్​, కూల్​డ్రింక్​ కొన్నాడు. అంతే! ఆ బిల్​ చూసి షాక్​ అయ్యాడు.

Popcorn price in PVR cinemas : “55 గ్రాముల చీస్​ పాప్​కార్న్​ ధర రూ. 460. 600ఎంఎల్​ పెప్సీ ధర రూ. 360. రెండు కలిపితే పీవీఆర్​ నోయిడాలో రూ. 820. ఇంత ధరలా! ఇది అమెజాన్​ ప్రైమ్​సబ్​స్క్రిప్షన్​తో దాదాపుగా సమానం. అందుకే ప్రజలు థియేటర్లకు వెళ్లట్లేదు. కుటుంబంతో కలిసి సినిమా చూడటం అనేది చాలా ఖరీదైన విషయం అయిపోయింది,” అని త్రిదిప్​ పేర్కొన్నారు.

ఈ ట్వీట్​ చూసి చాలా మంది నెటిజన్లు షాక్​ అవుతున్నారు. “ఇలాంటి ధరలను ఎలా భరించాలి? అందుకే ప్రజలు థియేటర్లకు వెళ్లట్లేదు,” అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. ‘మల్టీప్లెక్స్​లో పాప్​కార్న్​ డబ్బులు సేవ్​ చేయండి. ఆ డబ్బులతో రెస్టారెంట్​కి వెళ్లి భోజనం చేయండి,’ అని మరో వ్యక్తి సెటైర్​ వేశాడు. మరికొందరు మాత్రం.. పాప్​కార్న, కూల్​డ్రింక్​ కొనడం అనేది ఆప్షనల్​ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “థియేటర్​కి వెళ్లి సినిమా చూడండి. లంచ్​/ డిన్నర్​ చేయకండి. సినిమాకు వెళ్లి స్నాక్స్​ ధరలు ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేయడం వెర్రితనం,” అని మరో వ్యక్తి పేర్కొన్నాడు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ట్వీట్​ను ఇక్కడ చూడండి :

 

YES9 TV