Latest Posts

తెలంగాణ యాస, ఆచారాలతో ఫీల్‌గుడ్‌గా.. ఇంటింటి రామాయణం ఎలా ఉందంటే?

తెలంగాణలోని కమలాపూర్ గ్రామంలో నిజాయితీపరుడైన వ్యక్తి రాములు (వీకే నరేష్) అందర్నీ ప్రేమానురాగాలతో చూసుకొంటాడు. తన కంటూ పెద్ద కుటుంబాన్ని ఏర్పరుచుకొంటాడు.

తన ప్రాణ స్నేహితుడు చనిపోతే ఆయన కొడుకు శ్రీను (రాహుల్ రామకృష్ణ)ను ఆదరించడమే కాకుండా కొడుకు కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకొంటాడు. రాములు కూతురు సంధ్య (నవ్య స్వామి), శ్రీను ఒకరినొకరు ప్రేమించుకొంటారు. శ్రీను ఉద్యోగం కోసం భారీగా డబ్బు అవసరం అవుతుంది. ఈ క్రమంలో రాములు ఇంట్లో బంగారం పోతుంది.

ఇంట్లో బంగారం పోయిన తర్వాత రాములు కుటుంబంలో ఎలాంటి సంఘనలు చోటుచేసుకొన్నాయి? సంధ్య, శ్రీను ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత రాములు ఎలా రియాక్ట్ అయ్యాడు? సంధ్యతో లవ్ అఫైర్ కొనసాగిస్తున్నాడనే విషయం తెలిసిన తర్వాత శ్రీనును ఎలా దూషించాడు? రాములు ఆగ్రహం చెందడంతో శ్రీను ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? శ్రీను, సంధ్య ప్రేమ వ్యవహారం రాములు కుటుంబంలో ఎలాంటి విభేదాలు సృష్టించింది? బంగారాన్ని ఎవరు కొట్టేశారు? బంగారం చివరికి ఎలా దొరికింది? రాములు, శ్రీను, ఇతర కుటుంబ సభ్యులు మళ్లీ ఎలా కలిశారు అనే ప్రశ్నలకు సమాధానమే ఇంటింటి రామాయణం సినిమా కథ.

రాములు అనే కుటుంబ పెద్ద పాత్ర చుట్టూ ఉండే ఫ్యామిలి మెంబర్స్ మధ్య ఉండే అన్యోన్యత, ప్రేమానురాగాలతో కథ ప్రారంభమవుతుంది. రాములు నిరాడంబర జీవితం, అమాయకత్వం పాత్ర నడిపించే సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగుతాయి. అయితే ఇంట్లో బంగారం పోవడంతో కథలో వేగం పుంజుకొంటుంది. బంగారం పోయిన తర్వాత ఒళ్లుపట్టే పాత్రలో బిత్తిరి సత్తి పండించిన మంచి కామెడీ ఆకట్టుకొనేలా ఉంటుంది.

సెకండాఫ్‌లో శ్రీను, సంధ్య ప్రేమ వ్యవహారాన్ని తన సోదరుడు, బావ బయటపెట్టిన తర్వాత రాములులో పరువు ప్రతిష్టలు గుర్తుకు వస్తాయి. దాంతో ప్రేమగా పెంచిన శ్రీనును దారుణంగా దూషించడంతో కథలో ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. సెకండాఫ్‌లో పలు సన్నివేశాలు భారంగా, భావోద్వేగంగా సాగుతాయి.

YES9 TV