సూపర్‌ హీరో మూవీ ‘హనుమాన్’ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదిపురుష్ సినిమాతో పాటుగా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల అందరి అటెన్షన్ గ్రాప్ చేసిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి గతంలోనే విడుదల కావాల్సి ఉంది.

కానీ పలు కారణాలతో సినిమా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన అధికారికి ప్రకటన ఇచ్చే అవకాశం కల్పిస్తోందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే…

ఆ సినిమాతో మొదలు…

‘ఆ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన కల్కి వంటి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కలెక్షన్స్ పరంగా ఆ సినిమా పెద్దగా మెప్పించకపోయినా కంటెంట్ పరంగా మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత కరోనా సమయంలో చేసిన జాంబిరెడ్డి సినిమా కూడా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాల తర్వాత ఆయన ఏకంగా ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

YES9 TV