వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతదేశానికి గుడ్‌న్యూస్ చెప్పింది.
గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో తన గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai) ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత వెల్లడించారు.
మోడీ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ఫ్లాగ్‌షిప్ క్యాంపెయిన్‌ను, దీనిపై ప్రధాని మోడీ దార్శకనితను సుందర్ పిచాయ్ కొనియాడారు. అమెరికాలో చారిత్రాత్మక పర్యటన సందర్భంగా ప్రధాని మోడీని కలవడం గౌరవంగా ఉంది. భారత్ డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్లు(రూ. 8.19 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రధాని మోడీతో పంచుకున్నాం. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో మా గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.
