ఏపీకి చల్లని కబురు-ఈ జిల్లాల్లో ఎల్లుండి నుంచి వర్షాలు…

ఏపీలో జనం ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. గత రెండు వారాలుగా రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్నా.. తొలకరి మాత్రం పలకరించడం లేదు. దీంతో జనం వర్షాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రం మొత్తానికి కాకపోయినా కొన్ని జిల్లాలకు మాత్రం ఈ వార్త ఊరచనిచ్చేలా ఉంది. దీంతో ఎండ వేడిమి నుంచి కనీసం ఆయా జిల్లాలకు ఊరటదక్కనుంది.

ఏపీలో ఎల్లుండి నుంచి అంటే ఈనెల 18 నుంచి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ అందించిన వివరాల మేరకు జూన్‌ 16వ తేదీన ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని , 17 వ తేదీ మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుందని వెల్లడించింది. అయితే మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రం వర్షాలు నమోదవుతాయని తెలిపింది.

Posted Under AP
YES9 TV