Latest Posts

రోజుల తరబడి ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద నిరసన

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది.

ఢిల్లీ పోలీసులు ఆయనపై ఛార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆయనపై ఈ ఛార్జ్‌షీట్ నమోదయింది. పలు సెక్షన్ల కింద ఈ కేసులు పెట్టారు.

ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభకు ప్రాతినిథ్యాన్నివహిస్తోన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. వరుసగా మూడుసార్లు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు బ్రిజ్ భూషణ్‌పై వెల్లువెత్తాయి.

YES9 TV