ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల పిక్చర్ పై క్లారిటీ వస్తోంది. 2014 ఎన్నికల నాటి పొత్తులు దాదాపు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
కానీ, 2014 ఫలితాలు మాత్రం రిపీట్ కాకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమని చెబుతున్నారు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జగన్ ప్రభుత్వం పైన బీజేపీ ముఖ్య నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సీఎం జగన్ తనకు బీజేపీ మద్దతు లేదని తేల్చి చెప్పారు.
కొత్త సమీకరణాలు:బీజేపీ అగ్ర నేతల ఏపీ పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బీజేపీ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నరనే అభిప్రాయాల నడుమ ఒక్క సారిగా రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా వైసీపీ పాలన పైన అవినీతి ఆరోపణలు చేసారు. వీటిని వైసీపీ సీరియస్ గా తీసుకుంది. కేంద్రంలో అవసరమైన ప్రతీ సందర్భంలోనూ జగన్ బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ కు కేంద్రం నుంచి అదే విధమైన సాయం అందుతూ వచ్చింది. గత రెండు నెలల కాలంలో ఎప్పటి నుంచే ఏపీకి పెండింగ్ లో ఉన్న నిధులను కేంద్రం మంజూరు చేసింది. పార్లమెంట్ ప్రారంభోత్సవ సమయంలోనూ బీజేపీ నాయకత్వానికి మద్దతుగా సీఎం జగన్ నిలిచారు. దీంతో, జగన్ కు వ్యతిరేకంగా బీజేపీ ఏం చేయదనే అభిప్రాయం బలంగా ఉంది.
మూడు పార్టీల పొత్తు ఖాయమా:ఆ తరువాత చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా తో సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో తిరిగి ఎన్డీఏను విస్తరించే ప్రక్రియ ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో తిరిగి 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. చంద్రబాబు ఢిల్లీ సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు వద్దని తేల్చి చెప్పారు.
