Latest Posts

పవన్ గారితో ఆ సినిమా అంటే విమర్శొలొచ్చాయి: సాయిధరమ్ తేజ్

‘నన్ను ఎంతో ఆప్యాయంగా పెంచిన వ్యక్తితో సినిమా చేసే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం నావరకూ రావడంతో సంతోషంతో అంగీకరించా.

అది నా డ్రీమ్. ఇప్పుడది నెరవేరబోతోంది’ అని సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) అన్నారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వినోదాయ సీతం సినిమా రీమేక్ లో పవన్ తో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్నారు. ఆయన నటించిన విరూపాక్ష (Viroopaksha) సినిమా విడుదల సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

‘చాలామంది రీమేక్ ఎందుకు..? స్ట్రెయిట్ సినిమా చేయొచ్చు కదా అని కూడా అన్నారు. కామెంట్లూ వచ్చాయి. అవి పవన్ గారి వరకూ చేరాయి కూడా. కానీ.. మేము అవేమీ పట్టించుకోదలచుకోలేదు. కేవలం సోల్ తీసుకుని పవన్ కల్యాణ్ గారి ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని మొత్తం మార్చారు’ అని అన్నారు. తమిళ ఒరిజినల్ మూవీకి డైరక్ట్ చేసిన సముద్రఖని తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కేతికా శర్మ, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. జూలై 28న సినిమా విడుదల కానుంది.

YES9 TV