Latest Posts

స్టాక్‌మార్కెట్‌లో పంప్‌ అండ్ డంప్‌ స్కామ్‌..

తెలుగులో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ లో ATM పాత్ర మీకు గుర్తుండే ఉంటుంది. హిందీలో ఆ పాత్రను అర్షద్‌ వార్షి పోషించారు. అందులో ఆ పాత్ర పేరు సర్క్యూట్‌.

ఇప్పుడు ఈ సర్క్యూట్‌ చిక్కుల్లో పడ్డారు. రీల్‌ లైఫ్‌లో మున్నాభాయ్‌కు ఇచ్చిన సలహాలు వర్కౌట్‌ అయ్యాయేమో కాని రియల్‌ లైఫ్‌లో ఆయన ఇచ్చిన సలహాలు ఇప్పుడు ఆయన జేబుకు చిల్లుపెట్టాయి. భక్తి, అధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే ప్రముఖ టీవీ ఛానెల్‌ సాధనకు సంబంధించిన వ్యవహారాల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు అర్షద్‌పై నిషేధం విధించింది.

అంతే కాదు ఆ స్టాక్‌ వ్యవహారంలో సంపాదించిన మొత్తాన్ని వెనక్కితీసుకుంది. ఈ లావాదేవీల్లో అర్షద్‌ వార్సి 29.43 లక్షల రూపాయలు, ఆయన భార్య మారియ 37.58 లక్షల లాభం పొందినట్టు సెబీ గుర్తించింది. ఈ మొత్తాన్ని సెబీ స్వాధీనం చేసుకుంది.

నాకు నా భార్యకు స్టాక్ మార్కెట్ తెలియదు

మరో వైపు సెబీ విధించిన నిషేధం, జరిమానాపై అర్షద్‌ లబోదిబోమంటున్నారు. తనకు, తన భార్యకు స్టాక్‌ మార్కెట్‌ గురించి ఎటువంటి పరిజ్ఞానం లేదని, మీడియాలో వస్తున్న నమ్మొద్దంటూ ట్వీట్‌ చేశారు. అంతే కాదు ఎవరో సలహా తీసుకొని పెట్టుబడి పెడితే ఇప్పుడు తమ కష్టార్జితమంతా పోయిందని వివరణ ఇచ్చుకున్నారు. మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం అర్షద్ వార్సీ రూ.29.34 లక్షలు, మరియా రూ.37.56 లక్షలు సంపాదించినట్లు నివేదిక పేర్కొంది.

Editor